![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -313 లో.. ఇంటికి నందు, గౌతమ్ వస్తారు. వాళ్ళతో కృష్ణ తన చిన్నాన్నతో కలిసి ఇలా చేసిందంటూ కృష్ణ ని అపార్థం చేసుకొని కృష్ణ గురించి నెగెటివ్ గా నందుకి చెప్పుతుంది భవాని. మురారి అలా జరగడానికి కారణం అయిన వాళ్ళపై జాలి పడొద్దంటూ నందు గౌతమ్ లకి భవాని చెప్తుంది.
మరొక వైపు కృష్ణ, ముకుంద, మురారి ముగ్గరు షాపింగ్ చూస్తుంటారు. కృష్ణ, ముకుంద ఇద్దరు మురారి నా వైపు ఉన్నాంటే నా వైపు ఉన్నాడంటూ వాదనకి దిగుతారు. సరే పదా నీకు ఏసీపీ సర్ నా వైపే ఉన్నాడని నీకు ఎలా చెప్పాలో నాకూ తెలుసని కృష్ణ అంటుంది. ఆ తర్వాత కృష్ణ, ముకుంద ఇద్దరు మురారి కోసం చెరొక షర్ట్ తీసుకొని అక్కడే ఉన్న మురారిని పిలిచి ఇందులో ఇది నచ్చిందని అడుగుతారు. మురారి మాత్రం కృష్ణ తీసుకున్న షర్ట్ నచ్చిందని చెప్పి వెళ్లిపోతాడు.. కృష్ణ మురిసిపోతుంది. ముకుంద మాత్రం కోపంగా చూస్తుంటుంది. మరొక వైపు మధు దగ్గరికి రేవతి వచ్చి.. కృష్ణ ఎక్కడ కన్పించడం లేదని చెప్తుంది. నేనే కృష్ణని వాళ్ళు వెళ్లిన షాపింగ్ కి వెళ్ళమని పంపించానని మధు చెప్పగానే రేవతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరొక వైపు కృష్ణ మురారికి షర్ట్ తీసుకొని మురారికి చూపిస్తుంటుంది. అసలు ఈ కృష్ణకి మేం ఇక్కడికి వచ్చినట్టు ఎవరు చెప్పారు ఏంటి ఈ రోజు కృష్ణ టైమ్ బాగున్నాట్టు ఉంది. కృష్ణ ఏం చేసిన మురారి ఎక్సయిట్ మెంట్ తో చూస్తున్నాడని ముకుంద అనుకుంటుంది.
మరొక వైపు కృష్ణ ట్రీట్ మెంట్ చేసిన ఒక పాప ఫాదర్ కృష్ణని చూసి.. గుర్తుపట్టారా ఆ రోజు ఒక పాప కీ ట్రీట్ మెంట్ చేశారు. ఆ రోజు ఒక ఆర్మీ తో నాకు పని ఫేవర్ చెయ్యాలి అన్నారు కదా? ఏంటి మేడమ్ అని అతను అడుగుతాడు. అప్పుడే ముకుంద ఎక్కడ ఆదర్శ్ గురించి బయటపడుతుందోనని మురారిని అక్కడ నుండి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత మురారికి కృష్ణ డ్రెస్ సెలెక్ట్ చేసి ట్రయల్ చేసి రమ్మంటుoది. మరొక వైపు రేవతి దగ్గరికి నందు వచ్చి.. కృష్ణ గురించి అమ్మ చెప్పింది నిజమేనా అని అడుగుతుంది. తరువాయి భాగంలో కృష్ణకి మురారి రింగ్ ని గిఫ్ట్ గా ఇస్తాడు. అది అంత చాటు నుండి ముకుంద చూస్తుంటుంది. ఆ రింగ్ ని కృష్ణ చేతికి మురారి తొడుగుతాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |